అమరావతి:19 మందికి తెలుగు భాషా విశిష్ట పురస్కారాలు

- August 28, 2018 , by Maagulf
అమరావతి:19 మందికి తెలుగు భాషా విశిష్ట పురస్కారాలు

అమరావతి: గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఏటా ప్రకటించే తెలుగు భాషా విశిష్ట పురస్కారాలకు తెలుగు భాషా సాంస్కృతిక శాఖ 19 మందిని ఎంపిక చేసింది. మంగళవారం ఈ జాబితాను అధికారికంగా విడుదల చేసింది. పురస్కారానికి ఎంపికైన వారిలో ఈనాడు పాత్రికేయ పాఠశాల ప్రిన్సిపల్‌ ఎం.నాగేశ్వరరావుతో పాటు డాక్టర్‌ దానియేల్‌ నాజర్స్‌(ఫ్రాన్స్‌), గారపాటి ఉమామహేశ్వరరావు(ప్రకాశం), నాగసూరి వేణుగోపాల్‌(అనంతపురం), ఆదినారాయణ(మారిషస్‌), జె.సత్యవాణి(విశాఖపట్నం), రహమొద్దీన్‌ షేక్‌, జక్కంపూడి సీతారామారావు, నాదెండ్ల శ్రీమన్నారాయణ, దార్ల బుజ్జిబాబు, పారుపల్లి కోదండ రామయ్య, మేడిచెర్ల గోపాలకృష్ణమూర్తి, వెన్నెలకంటి ప్రకాశం, ప్రొఫెసర్‌ శరత్‌ జ్యోత్స్నారాణి, రెజీనా గుండ్లపల్లి, వావిలాల సుబ్బారావు, చొక్కాపు వెంకటరమణ, మంగళగిరి ప్రసాదరావు, సముద్రాల గురుప్రసాద్‌ ఎంపికయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com