నందమూరి కుటుంబానికి శాపంగా మారిన రోడ్డు ప్రమాదాలు..

- August 28, 2018 , by Maagulf
నందమూరి కుటుంబానికి శాపంగా మారిన రోడ్డు ప్రమాదాలు..

తెలంగాణ:నల్గొండలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలయ్యారు. నల్గొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.

గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆ యాక్సిడెంట్‌తో హరికృష్ణ బాగా కుంగిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా అన్నను కోల్పోయిన బాధను ఇప్పటికీ దిగమింగుకోలేక పోతున్నామని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. వాహనాలు జాగ్రత్తగా నడపాలని తన సినిమాల ద్వారా సందేశం ఇస్తున్నారు. ఇప్పుడు తండ్రి కూడా ఇలాగే రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో షాక్‌కి గురయ్యారు. కుటుంబ సభ్యులంతా తండ్రిని కోల్పోయిన బాధలో కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. 2009 ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ వాహనం కూడా ప్రమాదానికి గురైంది. ఆయన అదృష్టవశాత్తూ బయటపడ్డారు. ఆ తర్వాత జరిగిన రెండు ప్రమాదాల్లో సోదరుడు, తండ్రిని కోల్పోవడంతో అంతులేని విషాదం నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com