పాలస్తీనా: సంఘీభావ ఉద్యమ కార్యకర్తపై కాల్పులు

- August 28, 2018 , by Maagulf
పాలస్తీనా: సంఘీభావ ఉద్యమ కార్యకర్తపై కాల్పులు

ఓస్లో : నార్వేకి చెందిన పాలస్తీనా సంఘీభావ ఉద్యమ కార్యకర్త క్రిస్టిన్‌ ఫాస్‌పై వారం రోజుల్లో రెండుసార్లు ఇజ్రాయిలీ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. గత శనివారం ప్రదర్శన జరుగుతుండగా కఫిర్‌ కద్దుమ్‌ ప్రాంతంలో ఆమెపై కాల్పులు జరిగాయి. వృద్ధుడైన ఓ పాలస్తీనా జాతీయుడిని కారు వద్దకు తీసుకెళ్ళడానికి మరో కార్యకర్తతో కలిసి ఫాస్‌ నడిచి వెళుతుండగా, కారును అడ్డంగా పెట్టుకున్న సైనికులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె గాయపడ్డారు. కాగా, ఇజ్రాయిలీలు బల ప్రయోగానికి దిగకుండా నివారించేందుకు గానూ పాలస్తీనా నిరసనలకు తరచుగా అంతర్జాతీయ కార్యకర్తలు హాజరవుతూ వుంటారు. 'మాపై తుపాకీ ఎక్కుపెట్టడం మీకు ప్రమాదకరం' అని ఫాస్‌ వారిని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తుండగా కాల్పులు జరిగాయి. ఆ తర్వాత కొన్ని సెకన్లకే ఆమెపై రెండోసారి కాల్పులు జరిగాయి. ఈ పరిస్థితికి కారణం వివరించాలని నార్వే విదేశాంగ మంత్రిత్వ శాఖ గత వారం ఇజ్రాయిల్‌ విదేశాంగ శాఖను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com