ఏసియన్ గేమ్స్‌లో బహ్రెయిన్ పతకాల పంట
- August 28, 2018
ఒలువాకెమి అడెకోయా, విన్‌ఫ్రెడ్ యువి గోల్డ్ మెడల్స్ సాధించడంతో 18వ ఏసియన్ గేమ్స్‌లో బహ్రెయిన్ ఖాతాలో పతకాల సంఖ్య మరింత పెరిగింది. మొత్తం 3 మెడల్స్ తాజాగా బహ్రెయిన్ కొల్లగొట్టింది. జకార్తా, పాలెంబాంగ్‌లో జరుగుతున్న పోటీల్లో బహ్రెయిన్ ఆటగాళ్ళు అంచనాలకు మించి రాణిస్తున్నారు. మహిళల 400 మీటర్లు, 3000 మీటర్ల అథ్లెటిక్స్ విభాగంలో రెండు గోల్డ్ పథకాలు దక్కాయి. మరో పోటీలో బ్రాంజ్ మెడల్ దక్కింది. ఇప్పటిదాకా బహ్రెయిన్ 12 మెడల్స్ సాధించగా, వీటిలో ఆరు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. మూడు సిల్వర్, మూడు బ్రాంజ్ పథకాలు దక్కాయి. పాయింట్ల పట్టికలో బహ్రెయిన్ 12వ స్థానంలో నిలవగా, అరబ్ దేశాల్లో బహ్రెయిన్‌కి తొలి స్థానంద దక్కింది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







