ఇండోనేసియాలో భూకంపం
- August 29, 2018
జకార్తా: ఇండోనేసియా తూర్పుప్రాంతంలో అత్యంత తీవ్రస్థాయి భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై 6.2 ప్రకంపనల స్థాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రపంచంలోనే ఎక్కువ భూకంపాల బారినపడే దేశంగా ఇండోనేసియాకు పేరుంది. అంతేకాకుండా ఆసియా పసిఫిక్‌దేశాల్లో రింగ్ ఆఫ్ ఫైర్‌గా చెపుతారు. అమెరికా జియోలాజికల్ సర్వే అంచనాలప్రకారం సునామి హెచ్చరికలు సైతం ఉండవచ్చని వెల్లడించింది. సముద్ర జలాల్లో వెల్లువెత్తిన ఈ తీవ్రత సుమారు ఎనిమిది కిలోమీటర్ల లోతుగాను, వంద కిలోమీటర్ల ఈశాన్యప్రాంత సముద్రజలాలనుంచి ఉద్భవించింది. ఇండోనేసియా ప్రాంతంలోని టిమార్ దీవుల్లో ఈ భూకంపం సంభవించిందని అమెరికా ఏజెన్సీ వెల్లడించింది. కొన్ని సెకన్లపాటు అత్యంత తీవ్రస్థాయిలోప్రకంపనలు వణికించాయి. ఒక కంపెనీ అధికారి మాట్లాడుతూ తాను రెండో అంతస్తులో తన కార్యాలయంలో ఉండగా అందరూ బైటికి పరుగులు తీస్తున్నారని అదేమనిచూస్తే భూకంపం సంభవించిందని చెప్పడంతో తాను కూడా బైటికి పరుగుతీసినట్లు వెల్లడించారు. అన్ని కుర్చీలు సుడులు తిరుగుతూ కనిపించాయని, ఈ భూకంపంతో తాము మరింత వణికినట్లు వెల్లడించారు. లాంబాక్ దీవిని ఇటీవలి కాలంలో భూకంపాలు వణికించాయి.
సుమారు 555 మందిని బలిగొన్నాయి. 2004లో సునామి రిక్టర్‌స్కేలుపై 9.3తీవ్రస్థాయిని నమోదుచేసింది. సుమత్రా దీవుల్లో సంభవించిన ఈ కుంభకోణంలో 2.20లక్షల మంది చనిపోయినట్లు అంచనా. హిందూమహాసముద్రంలో సంభవించిన ఈ భూకంపంలో ఇండోనేసియా దేశీయులే 1.68 లక్షలమందివరకూ చనిపోయినట్లు ప్రభుత్వ గణాంకాలే చెపుతున్నాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







