హరికృష్ణ ఇంటికి చేరుకున్న ఆయన పార్థివ దేహం
- August 29, 2018
హైదరాబాద్:మెహదీపట్నంలోని హరికృష్ణ ఇంటికి ఆయన పార్థివ దేహం చేరుకుంది.. ఆయనను చివరి సారి చూసేందుకు భారీగా రాజకీయ, సినీ ప్రముఖులు, బంధువులు, అభిమానులు, కార్యకర్తలు ఇంటికి చేరుకున్నారు. హరికృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు అంతా ఇంటికి చేరుకుంటున్నారు. ఆంబులెన్స్ నుంచి కిందకు దిగిన హరికృష్ణ భౌతిక కాయాన్ని చూడగానే అంతా కన్నీటి పర్యంతమయ్యారు.
కామినేని ఆస్పత్రి నుంచి ఆంబులెన్స్‌లో పార్థివ దేహాన్ని ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు.. ఆంబులెన్స్‌కు ముందు ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్.. మరోవైపు కళ్యాణ్ రామ్ నడుస్తూ కనిపించారు. ఇంతకాలం తమ వెంట ఉండి నడిపించిన తండ్రి మరణాన్ని ఇద్దరూ జీర్ణించుకోలేకపోతున్నారు.. తన్నుకొస్తున్న ధుఃఖాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఆంబులెన్స్ వచ్చిన కాన్వాయ్‌తో పాటు ఇంటికి చేరుకున్నారు.. వైసీపీ నేత కొడాలి నాని.. ఆంబులెన్స్‌లోనే ఉండి.. పార్థివ దేహాన్ని కిందకు దింపారు..
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







