తమిళంలో రీమేక్ కానున్న 'నిన్ను కోరి'
- August 30, 2018
ఒకప్పుడు మనోళ్ళు బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలని ఎక్కువగా రీమేక్ చేసి విజయం సాధించేవాళ్ళు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. మన సినిమాలనే వారు రీమేక్ చేసి సక్సెస్‌లని సాధిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది, ఎన్టీఆర్ నటించిన టెంపర్, నాన్నకు ప్రేమతో చిత్రాలను తమిళం లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో తెలుగు సూపర్ హిట్ చిత్రం కోలీవుడ్ కు వెళ్లనుంది.
నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలలో శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం నిన్ను కోరి. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. గోపి సుందర్ అందించిన సంగీతం కూడా సినిమాకి చాలా ప్లస్ అయింది. ఇప్పుడు ఈ సినిమా తమిళ భాషలో రీమేక్ అవుతుంది. . యువ హీరో వైభవ్ నాని పాత్రలో నటించే అవకాశాలు ఉన్నాయట. కాస్మో కిరణ్ నిర్మించనున్న ఈ చిత్రం యొక్క వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







