ఓ సారి డాక్టర్‌కు చూపించుకోండి!
- August 30, 2018అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ఎఫ్2. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర బేనర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవలే వెంకటేష్, వరుణ్‌లు మాస్‌లుక్‌లో లుంగీతో కనిపించి ఈ మూవీపై భారీ అంచనాలను పెంచారు. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌గా వస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌లో వెంకీ సరసన తమన్నా, వరుణ్ సరసన మెహరీన్ జోడి కట్టింది. తాజాగా ఈ ఇద్దరు భామలు కలిసి దిగిన సెల్ఫీలను మెహరీన్ తన ట్వీట్టర్‌లో షేర్ చేసింది. విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఉన్న ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. నిన్నటి వరకు బాగనే ఉన్నారు కదా.. ఎందుకు అలా అయిపోయారు.. ఓ సారి డాక్టర్‌కు చూపించుకోండి అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి