ప్రారంభమైన హరికృష్ణ అంతిమ యాత్ర…పాడె మోసిన చంద్రబాబు

- August 30, 2018 , by Maagulf
ప్రారంభమైన హరికృష్ణ అంతిమ యాత్ర…పాడె మోసిన చంద్రబాబు

నందమూరి హరికృష్ణ అంతిమ యాత్ర మొదలైంది. హరికృష్ణ భౌతిక కాయాన్ని నివాసం నుంచి వాహనం వరకు తరలించడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా భుజం కలిపారు. హరికృష్ణ తనయులు నందమూరి కల్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ముందు నడవగా.. అశేష జనవాహిని అశ్రునయనాలతో పార్థిక దేహం వెన్నంటి సాగుతోంది. హరికృష్ణ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ.. అభిమానులు, కార్తకర్తలు అంతిమ యాత్రలో ముందుకు సాగుతున్నారు.

హరికృష్ణ అంత్యక్రియలకు సమయం దగ్గరపడుతోన్న కొద్ది అభిమానులు, టీడీపీ కార్యకర్తల్లో దుఖం ఆగడం లేదు. ఆప్యాయంగా మాట్లాడే మంచి మనిషిని కోల్పోయిన బాధ ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ముక్కుసూటి తనంతో, తనదైన విలక్షణ వ్యక్తిత్వంతో రాజకీయాలతోపాటు, సినీ జీవితంలోనూ తనదైన ముద్ర వేసిన సీతయ్యను అంతా స్మరించుకుంటున్నారు. అంతులేని విషాదంలో ఉన్న కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌లను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.

అంతిమ యాత్రకు ముందు నందమూరి హరికృష్ణ నివాసంలో కర్మకాండలకు సంబంధించిన క్రతువు నిర్వహించారు. కృష్ణా జిల్లాకు చెందిన వేద పండితులు, ఇద్దరు కుమారులు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్‌ చేత జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించారు. తండ్రి జ్ఞాపకాలు కళ్ల ముందే కదలాడుతుండడంతో దుఖాన్ని ఆపుకోవడం ఇద్దరికీ సాధ్యం కావడం లేదు. కర్మకాండ సమయంలో…. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ స్నేహితులు, ఏపీ-తెలంగాణకు చెందిన మంత్రులు, ఇతర ముఖ్యులు కూడా అక్కడే ఉన్నారు. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలంటూ శ్రద్ధాంజలి ఘటించారు.

హరికృష్ణ అంతిమయాత్ర సందర్భంగా ట్రాఫిక్‌కి ఇబ్బంది లేకుండా చూసేందుకు.. పలు ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల వరకూ వాహనాలను దారి మళ్లిస్తున్నారు. మెహదీపట్నం, నానాల్ నగర్ క్రాస్ రోడ్డు, టోలీచౌకి, విస్పర్ వ్యాలీ టీ జంక్షన్ మీదుగా ఫిల్మ్‌నగర్‌ మహాప్రస్థానానికి చేరుతుంది. అక్కడ అధికారిక లాంఛనాలతో సీతయ్యకు తుది వీడ్కోలు పలుకుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com