ఎన్ఠీఆర్ కుటుంబంపై ప్రేమను చాటుకున్న కేసీయర్...హరికృష్ణ పేరిట స్మారక చిహ్నం !!
- August 30, 2018
మాజీ మంత్రి, ప్రజా నాయకుడు నందమూరి హరికృష్ణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆయన అంత్యక్రియలు అధికారం లాంఛనాలతో నిర్వహిస్తున్న కేసీయార్ ప్రభుత్వం హరిక్రిష్ణ స్మారక చిహ్నం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో హరికృష్ణ స్మారక చిహ్నం ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా స్థలాన్నికేటాయించింది. అంత్యక్రియలు ముగిశాక కుటుంబసభ్యుల నిర్ణయం మేరకు స్మారక చిహ్నం నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అక్కడకు అలా మారింది !
మొదట హరిక్రిష్ణ అంత్యక్రియలను మొయినాబాద్‌లో ఫాంహౌస్‌లో నిర్వహించాలని కుటంబసభ్యులు అనుకున్నారు. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరాం అంత్యక్రియలు కూడా ఇక్కడే నిర్వహించారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని చెప్పడంతో వేదికను మహా ప్రస్తానానికి మార్చారు. జూబ్లీహిల్‌లో మహాప్రస్థానం అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అంగీకరించారు.
ప్రేమను చాటుకున్న కేసీయార్ !
స్వర్గీయ నందమూరి తారక రామారావు పట్ల కేసీయార్ కి అభిమానం ఎంతో ఉంది. ఆయన కుటుంబ సభ్యుల మీదా అదే ప్రేమ ఆయన చూపిస్తూ వచ్చారు. ఇపుడు హటాత్తుగా హరిక్రిష్ణ దుర్మరణం పాలు కావడంతో కేసీయార్ సర్కార్ అధికార లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించేందుకు నిర్ణయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. దానికి తోడు స్మారక చిహ్నం నిర్మించేదుకు స్థలం కూడా ఇస్తామని ముందుకు రావడం విశేషం. ఇది నిజంగా నందమూరి అభిమానులకు ఆనందం కలిగించే వార్తే. రాజకీయాలకు అతీతంగా కేసీయార్ తీసుకున్న్న ఈ నిర్ణయాలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







