సౌదీ అరేబియాలో విడుదల కానున్న తొలి బాలీవుడ్ సినిమా
- August 30, 2018
ముంబై:బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్, మౌనీ రాయ్ జంటగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘గోల్డ్’ . 1946 ఒలింపిక్స్‌లో భారత్‌కు హాకీలో గోల్డ్ మెడల్ అందించిన కోచ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. విడుదలైన తొలిరోజే 25.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తద్వారా ఈ ఏడాది విడుదలైన సంజు, రేస్ 3 సినిమాల తర్వాత తొలిరోజే అత్యధిక వసూళ్లు సాధించిన మూడో సినిమాగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా బంగారం లాంటి సినిమా అంటూ ప్రశంసలు సైతం దక్కించుకుంది. తాజాగా మరో రికార్డును కూడా సొంతం చేసుకునేందుకు సిద్ధమైంది. సౌదీ అరేబియాలో విడుదల కానున్న తొలి బాలీవుడ్ సినిమాగా ‘గోల్డ్’ చరిత్ర సృష్టించనుంది.
చాలాసంతోషంగా ఉంది..
‘భారత్‌కు పసిడి పతకాన్ని అందించిన కథాంశంతో తెరకెక్కిన గోల్డ్ సినిమా సౌదీ అరేబియాలో విడుదల కాబోతుంది. తద్వారా సౌదీలో విడుదలవుతున్న తొలి బాలీవుడ్ సినిమాగా నిలవనుంది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. కాగా కట్టుబాట్లకు మారుపేరైన సౌదీ అరేబియాలో 35 ఏళ్ళ సుదీర్ఘ నిషేధం తర్వాత మొదటి సినిమా థియేటర్‌ను ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రారంభించారు. సౌదీ రాజధాని రియాద్‌లో ప్రారంభించిన ఓ థియేటర్‌లో మొదటగా ‘బ్లాక్ పాంథర్’ సినిమాను ప్రదర్శించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







