కొత్తవారికి ఆహ్వానం
- August 30, 2018
ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో కొత్త చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విద్యా సాగర్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ కోసం 23 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసులో ఉండే అబ్బాయి, 18 నుంచి 22 సంవత్సరాల మధ్య వయసులో ఉండే అమ్మాయి కోసం ఆడిషన్స్ నిర్వహించబోతున్నట్టు చిత్ర నిర్మాత రామ్ తాళ్ళూరి తెలిపారు. అలాగే ఈ చిత్రం లో 12 నెలల పాప పాత్ర కీలకమైంది. ఈ పాత్రను కూడా ఆడిషన్ ద్వారానే ఎంపిక చేయనున్నారు. అల్ట్రా మోడ్రన్ లవ్ స్టొరీ కావడం వల్లే కొత్త వారితో సినిమా చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ' ఈ న్యూ ఏజ్ అల్ట్రా మోడ్రన్ రొమాంటిక్ కామెడీ సినిమాలో నటించాలనుకునే వారు తమ రీసెంట్ ఫొటో, డాన్స్ వీడియో ( ఒక నిమిషం), యాక్టింగ్ వీడియో (ఒక నిమిషం) aబసఱ్‌ఱశీఅర.రత్‌ీవఅ్‌వత్‌ీaఱఅఎవఅ్‌రఏస్త్రఎaఱశ్రీ.షశీఎ పంపించండి. ఈ వీడియో క్లిప్పింగ్స్ ఆధారంగా ఆడిషన్స్‌కి ఎంపిక చేస్తాం. మేము నిర్వహించే ఆడిషన్స్ ద్వారా హీరో హీరోయిన్‌ని ఎంపిక చేస్తాం. మరోవైపు మా బ్యానర్‌లో రవితేజ హీరోగా, వి ఐ. ఆనంద్ దర్శకత్వంలో సినిమా రూపొందించబోతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







