ఇండియా:వాహన దారుల నెత్తిన బీమా పిడుగు!
- August 30, 2018
ఇండియా:వాహన దారుల నెత్తిన బీమా పిడుగు పడనుంది.. కొత్తగా కార్లు కొనేవారు ఇకపై మూడేళ్లకు బీమా తీసుకోవాల్సిందే.. బైక్‌లకు ఐదేళ్ల బీమా తప్పనిసరి చేస్తూ ఐఆర్డీయేఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన శనివారం నుంచే అమల్లోకి రానుంది.
కొత్త కార్లు, బైక్‌లు ఇక మరింత ప్రియం కానున్నాయి.. సెప్టెంబరు ఒకటి నుంచి వాహనాలు కొనుగోలు చేసే వారు థర్డ్ పార్టీ బీమా రూపంలో అదనపు భారం మోయాల్సిన పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి మండలి ఈ నిర్ణయం తీసుకుంది. కార్ల యజమానులు ఇకపై ఒకేసారి మూడేళ్లకు థర్డ్ పార్టీ బీమా చేయించుకోవాలి. బైక్‌లు కొనేవారు ఐదేళ్లపాటు బీమాను ఐఆర్డీయేఐ తప్పనిసరి చెప్పింది.
మోటారు వాహన చట్టం ప్రకారం థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి.. ఈ బీమా ద్వారా వాహనం చోరీ లేదా ప్రమాదానికి గురైనప్పుడు జరిగిన నష్టానికి కవరేజీ లభిస్తుంది.. ఇప్పటి వరకు ఏడాది మాత్రమే బీమా సదుపాయం ఉండేది.. వాహనం కొనుగోలు చేసినప్పుడు మాత్రమే బీమా చేయించి.. ఆ తర్వాత రెన్యువల్ చేయించుకునేవారు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో వాహనాలను కొన్నప్పుడే దీర్ఘకాల పాలసీలను తీసుకునే విధంగా సుప్రీంకోర్టు ఆదేశించింది.
థౌజంట్ సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన కార్లపై మూడేళ్ల థర్డ్ పార్టీ బీమా కోసం 5,286 రూపాయలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. థౌజంట్ నుంచి 1500 సీసీ వరకు 9,534 రూపాయలు.. 1500కుపైగా సీసీ కార్లపై 23,305 రూపాయలు చెల్లించాలి. ఇక బైక్‌లకు ఒకేసారి ఐదేళ్లకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. 75 సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్ధ్యం కలిగిన బైక్‌లకు థర్డ్ పార్టీ బీమా ప్రీమియం కింద 1,045 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 75 నుంచి 150 సీసీ వరకు 3,285… అలాగే 150 నుంచి 350 సీసీ వరకు 5,453 రూపాయలు.. 350కి పైగా సీసీ బైక్‌లపై 13,034 రూపాయలు ప్రీమియం వర్తిస్తుంది.
ఈ నిర్ణయం వాహనదారులకు కొంత చేదు కలిగించేదే అయినా, ఏటా రెన్యువల్ చేసుకోవాల్సిన ఇబ్బంది తప్పనుంది. అయితే, టూవీలర్ల కొనుగోళ్ల డిమాండ్‌పై ఈ నిబంధనలు ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







