యూ.ఏ.ఈ:పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్‌పై బ్యాన్ విధించాలి
- August 30, 2018
యూ.ఏ.ఈ:ఎనర్జీ డ్రింక్స్‌ని పిల్లలు వినియోగించకుండా బ్యాన్ విధించాలంటూ యూకేలో వెల్లువెత్తుతున్న నినాదాలకు, యూఏఈ డాక్టర్లు సైతం మద్దతు పలికారు. ముఖ్యంగా యంగ్‌స్టర్స్‌లో ఎనర్జీ డ్రింక్స్ వినియోగం ఎక్కువైందనీ, ఇది వారి ఆరోగ్యం పట్ల తీవ్ర ప్రభావం చూపుతోందని యూఏఈకి చెందిన డాక్టర్లు చెప్పారు. మరో వైపు యూకే ప్రైమ్ మినిస్టర్ థెరీసా మే మాట్లాడుతూ మ్రుఖ ఎనర్జీ డ్రింక్స్‌ని యువతరానికి చిన్న పిల్లలకు విక్రయించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. యూఏఈలో ఇటీవల ఎనర్జీ డ్రింక్స్‌పై వ్యాట్ని 100శాతం పెంచడం, వాటి వినియోగం తగ్గించడం కోసమేనని యూఏఈకి చెందిన పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎనర్జీ డ్రింక్స్ కారణంగా పిల్లలు అస్వస్థతకు గురవుతున్నారనీ, పలు రకాలైన రోగాల బారిన పడుతున్నారని డాక్టర్లు చెప్పారు. ఎనర్జీ డ్రింక్స్‌పై బ్యాన్ విధించాల్సిందేనని యూనివర్సల్ హాస్పిటల్ డాక్టర్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ షానవాస్ ఖాన్ అభిప్రాయపడ్డారు. డయాబెటిస్, హృద్రోగ సమస్యలు ఎనర్జీ డ్రింక్స్ కారణంగా పెరుగుతాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







