మస్కట్‌:రికార్డు తిరగరాసిన మవసలాత్‌

- August 30, 2018 , by Maagulf
మస్కట్‌:రికార్డు తిరగరాసిన మవసలాత్‌

మస్కట్‌: ఒమన్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ మవసలాత్‌, ఈద్‌ అల్‌ అధా రెండవ రోజున 28,000 మంది ప్రయాణీకులకు సేవలు అందించడం ద్వారా సరికొత్త రికార్డ్‌ని సొంతం చేసుకుంది. ఈద్‌ అల్‌ అదా సెలవుల సందర్భంగా ఆగస్ట్‌ 17 నుంచి 25 వరకు మొత్తం 187,964 మంది ప్రయాణీకులు మవసలాత్‌ సేవల్ని వినియోగించుకున్నారు. ఈద్‌ అల్‌ అదా రెండవ రోజున 28 వేల మంది ప్రయాణించడం ఓ రికార్డ్‌. ప్రయాణీకుల్లో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ పట్ల అవగాహన పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామమని మవసలాత్‌ ప్రతినిథులు పేర్కొన్నారు. ప్రయాణీకులకు ఈ సందర్భంగా మవసలాత్‌ కృతజ్ఞతలు తెలిపింది. భద్రత, మెరుగైన సౌకర్యాలు, సమయపాలన ఇవన్నీ మవసలాత్‌ ఈ స్థాయిలో ప్రయాణీకుల్ని ఆకట్టుకోవడానికి కారణమని సంస్థ ప్రతినిథులు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com