ప్రధాని మోడీ హత్యకు కుట్ర...
- August 31, 2018
రాజీవ్ హత్య తరహాలో ప్రధాని మోడీని హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్రపన్నారా..? కామ్రెడ్లు కమ్యూనికేషన్ కోసం రాసిన లేఖల్లో ఏముంది..? బీమా కోరేగావ్ అల్లర్ల వెనుక కుట్ర దాగుందా..? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం చెబుతున్నారు పుణె పోలీసులు. ఇటీవల పౌర హక్కుల నేతల అరెస్ట్ దేశంలో తీవ్ర సంచలనం రేపిన నేపథ్యంలో పుణె పోలీసులు చెబుతున్న మాటలు మరింత సంచలనంగా మారాయి.
మహారాష్ట్ర పోలీసులు చెబుతున్న మాటలు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఎలాగైతే హత్యచేశారో, అదే తరహాలో మోడీ రాజ్ ను అంతం చేయాలనుకున్నారని సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ ఆరోపణలకు సాక్ష్యాధారాలను కూడా జోడించారు. కామ్రెడ్లు కమ్యూనికేషన్ కోసం రాసిన లేఖను విడుదల చేశారు. తాము జరిపిన దర్యాప్తులో మావోయిస్టు ఆర్గనైజేషన్స్ అన్నీ కలిసి పెద్ద కుట్ర పన్నినట్టు తెలిసిందన్నారు.
భీమాకోరేగావ్ అల్లర్లకు సంబంధించి.. 2017 డిసెంబర్ 31న కొందరు విద్వేష ప్రసంగాలు చేశారని.. తర్వాత పరిస్థితుల్లో నిందితులపై జనవరి 8న కేసు రిజిస్టర్ చేశామని చెప్పారు మహారాష్ట్ర ADG పరమ్ బీర్ సింగ్. విద్వేషం చిమ్మినవారిపై ఆయా సెక్షన్ల కింద కేసులు పెట్టామన్నారు. నిందితుల్లో ఎక్కువ మంది కబీర్ కాలా మంచ్ కు చెందినవారే అని అన్నారు. మావోయిస్టు ఆర్గనైజేషన్స్ తో కలిసి నిందితులు పావులు కదిపారని చెప్పారు. ఇందులో ఓ టెర్రర్ గ్రూప్ కూడా ఇన్వాల్వ్ అయ్యిందన్నారు. నిందితులపై మే 17న UAPA కింద కేసులు పెట్టామన్నారు.
పౌర హక్కుల నేత రోనా విల్సన్ కామ్రేడ్ ప్రకాశ్ కు రాసిన లేఖను చదివి వినిపించారు పీబీ సింగ్. కిషన్‌తో పాటు ఇతర కామ్రేడ్లు మోడీ ప్రభుత్వ అంతం కోసం చర్యలు చేపట్టారని, గ్రనేడ్ లాంచర్ల సప్లై కోసం ఏడాదికి 8 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని రోనా విల్సన్ .. కామ్రేడ్ ప్రకాశ్ ను కోరారని పోలీసులు చెప్పారు. ఈ లేఖల ఆధారంగానే దర్యాప్తు జరిపి.. స్పష్టమైన ఆధారాలు లభించాకే.. మహారాష్ట్ర పోలీసులు.. పలు పట్టణాల్లో సోదాలు జరిపి అయిదుగురు పౌర హక్కుల నేతలను అరెస్టు చేశారని చెప్పారు పీబీ సింగ్. ఈ నేతల్లో విరసం రచయిత వరవరరావు కూడా ఉన్నారని తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







