దుబాయ్‌:1000 దిర్హామ్‌ల జరీమానా, 6 బ్లాక్‌ పాయింట్స్‌

- August 31, 2018 , by Maagulf
దుబాయ్‌:1000 దిర్హామ్‌ల జరీమానా, 6 బ్లాక్‌ పాయింట్స్‌

దుబాయ్‌:దుబాయ్‌ పోలీస్‌ వాహనదారులకు హెచ్చరిక జారీ చేస్తూ, ఓ ట్వీట్‌ చేయడం జరిగింది. ఈ ట్వీట్‌ ప్రకారం వాహనదారులు ఎమర్జన్సీ వెహికిల్స్‌కి తప్పనిసరిగా దారి ఇవ్వవలసి వుంటుంది. ఒకవేళ దారి ఇవ్వని పక్షంలో 1000 దిర్హామ్‌ల జరీమానాతోపాటుగా 6 బ్లాక్‌ పాయింట్స్‌ని వాహనంపై నమోదు చేస్తారు. ట్రాఫిక్‌ నిబంధనల ప్రకారం ఎమర్జన్సీ వెహికిల్స్‌కి దారి ఇవ్వవలసి వుంటుందనీ, లేకపోతే జరీమానా, బ్లాక్‌ పాయింట్స్‌ ఎదుర్కోవాల్సి వస్తుందని దుబాయ్‌ పోలీస్‌ వాహనదారులకు ట్విట్టర్‌ ద్వారా సూచనలాంటి హెచ్చరిక చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com