షూటింగ్ మధ్యలో హీరోయిన్ జంప్..
- September 01, 2018
చుట్టూ కొండలు మధ్యలో మనుషులు. అక్కడ షూటింగ్. హీరో హీరోయిన్లతో పాట చిత్రీకరిస్తున్నారు యూనిట్ సభ్యులు. మధ్యలో చిన్న విరామం. ఇంతలో హీరోయిన్ కనిపించకుండా పోయింది. విషయం తెలిసి యూనిట్ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. కేశవన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అవళుక్కెన్న అళగియ ముగం’. కొడైకెనాల్‌లోని ఎత్తైన కొండల నడుమ పాటను చిత్రీకరిస్తున్నారు.
హీరోయిన్ అనుపమ ప్రకాష్ విరామం మధ్యలో తన రూముకు వెళ్లింది. మళ్లీ షూటింగ్ మొదలు పెట్టే సమయానికి కనిపించకుండా పోయింది. దీంతో కంగారు పడ్డ యూనిట్ సభ్యులు ఆరా తీయగా తన స్వస్థలం ఢిల్లీ వెళ్లిపోయినట్లు తెలుసుకున్నారు. నిర్మాత స్వయంగా వెళ్లి విషయం అడగ్గా ఎత్తైన కొండల నడుమ డాన్స్ చేయడంతో భయంగా అనిపించిందని అందుకే వచ్చేసానని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. పాటను కంప్లీట్ చేసే నిమిత్తంగా మళ్లీ ఆమెను తీసుకువచ్చి మిగిలిన భాగాన్ని చిత్రీకరించారు చిత్ర యూనిట్.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







