ఏటీఎం బూత్‌లోకి దూసుకెళ్ళిన కారు: ఇద్దరికి గాయాలు
- September 01, 2018
మోటరిస్ట్ ఒకరు తాను నడుపుతున్న వాహనంపై అదుపు కోల్పోవడంతో ఆ వాహనం దుబాయ్‌లోని ఓ మాల్ వద్దనున్న ఏటీఎం బూత్‌లోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. బుర్జుమాన్ షాపింగ్ సెంటర్ వద్ద రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఏటీఎం బూత్‌లో ఐదుగురు వున్నట్లు తెలుస్తోంది. ఫోర్ వీల్ డ్రైవ్ కారు ఈ ప్రమాదానికి కారణమైంది. పోలీస్ కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందగానే, అక్కడికి పోలీసులు చేరుకున్నారు. 40 ఏళ్ళ వయసున్న ఆసియాకి చెందిన డ్రైవర్ కారు నడుపుతున్నట్లు గుర్తించారు. మరో కారు అడ్డంగా రావడంతో తాను బ్రేక్ వేసే క్రమంలో, పొరపాటున యాక్సిలరేటర్‌పై కాలు మోపడంతో ప్రమాదం జరిగిందని ఆ కారుని నడుపుతున్న వ్యక్తి పోలీసులకు తెలిపారు. విచారణ జరిపిన పోలీసులు, వాహనాన్ని నడిపిన వ్యక్తి ఆల్కహాల్గానీ డ్రగ్స్‌గానీ తీసుకోలేదనీ, మొబైల్ ఫోన్‌ని సైతం ఆ సమయంలో వినియోగించలేదని తెలిపారు. నిర్లక్ష్యం, వాహనం నడుపుతున్న సమయంలో సరిగ్గా దృష్టిపెట్టకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని లెఫ్టినెంట్ కల్నల్ అల్ కాసిమ్ చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







