హెచ్1 బీ వీసా ఫ్రాడ్ : భారతీయ సీఈవో అరెస్టు
- September 01, 2018
హెచ్1-బీ వీసా, గ్రీన్ కార్డుల దరఖాస్తుల్లో అక్రమాలకు పాల్పడుతున్న ఒక ఇండియన్ సీఈవోకు అమెరికా ప్రభుత్వం చెక్ చెప్పింది. తప్పుడు, మోసపూరిత పత్రాలతో దాదాపు 200 హెచ్1 బీ వీసాలను పొందిన కేసులో అమెరికాలో అజీమెట్రీ, డివెన్సి అనే రెండు ఐటీ కంపెనీలకు సీఈవో ప్రద్యుమ్న కుమార్ సామల్ (49) ను అధికారులు అరెస్ట్ చేశారు.
నకిలీ, మోసపూరితమైన డాక్యుమెంట్లతో 200మంది విదేశీయులకు హెచ్1 బీ వీసాలు సాధించారనే ఆరోపణలతో కమార్‌ను అరెస్ట్ చేశారు. ఇండియా నుంచి తిరిగి అమెరికా వస్తుండగా సియాటెల్ విమానాశ్రయం వద్ద ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. 2018, ఏప్రిలో నమోదైన వీసా ఫ్రాడ్ కేసు విచారణ జరుగుతుండగా నిందితుడు సామల్ పారిపోయాడని అధికారులు తెలిపారు. 2010, 2011 సంవత్సరాల్లో వాషింగ్టన్ లో హెచ్1-బీ వీసా, గ్రీన్ కార్డుల పేరుతో భారీ మోసాలకి పాల్పడాడనీ, బెంచ్-అండ్-స్విచ్ స్కీం కింద వీసా దరఖాస్తుల కోసం కస్టమర్ల నుంచి డబ్బును నేరుగా తన ఖాతాలోకి మళ్లించి, తద్వారా ప్రభుత్వాన్ని మోసగించాడని అధికారులు ఆరోపించారు. కాగా వీసా మోసం కేసులో పది సంవత్సరాల జైలుతో పాటు, 250,000 డాలర్లు జరిమానా విధించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







