భారీ ఆర్డర్- విప్రో హైజంప్
- September 02, 2018
అమెరికన్ కంపెనీతో భారీ కాంట్రాక్టు కుదుర్చుకున్న వార్తల కారణంగా దేశీ సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5.5 శాతం జంప్‌చేసి రూ. 318 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 327 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.
10 ఏళ్లకు
సమీకృత సొల్యూషన్లు, సర్వీసులు అందించేందుకు ఇల్లినాయిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లింకన్‌షైర్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఐటీ సేవల దేశీ సంస్థ విప్రో లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఇది కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందంకాగా.. అలైట్ సొల్యూషన్స్ నుంచి లభించిన కాంట్రాక్టు పదేళ్లకాలంపాటు కొనసాగనున్నట్లు తెలియజేసింది. డీల్ ద్వారా ఒప్పంద కాలంలో 150-160 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరనున్నట్లు విప్రో తెలియజేసింది. ఒప్పందంలో భాగంగా డిజిటల్ టెక్నాలజీస్, ఆటోమేషన్, అనలిటిక్స్ సంబంధ సేవలను అందించనున్నట్లు వెల్లడించింది. అలైట్ సొల్యూషన్స్ కస్టమర్లకు టెక్నాలజీ ఆధారిత హెల్త్, వెల్త్, హెచ్‌ఆర్, ఫైనాన్స్ సొల్యూషన్స్ అందిస్తుంటుంది.
విప్రో
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కన్సల్టింగ్, బిజినెస్ ప్రాసెస్ సర్వీసులను అందిస్తున్న దేశీ దిగ్గజం విప్రో కంప్యూటింగ్, హైపర్ ఆటోమేషన్, రోబోటిక్స్, క్లౌడ్, అనలిటిక్స్ తదితర వర్థమాన టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. తద్వారా తమ క్లయింట్లు డిజిటల్ విభాగంలో కార్యకలాపాలను మెరుగుపరచుకునేందుకు సహకరిస్తోంది. కంపెనీలో ప్రమోటర్లకు 74.31 శాతం వాటా ఉంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..