అబుదాబీ:చవకగా ఎకానమీ టిక్కెట్లు

- September 02, 2018 , by Maagulf
అబుదాబీ:చవకగా ఎకానమీ టిక్కెట్లు

అబుదాబీ నుంచి ప్రయాణించాలనుకునే విమాన ప్రయాణీకులకు బంపర్‌ ఆఫర్‌. ఎతిహాద్‌ ఫ్లైట్‌ టిక్కెట్స్‌పై బార్గెయినింగ్‌కి అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు హ్యాండ్‌ బ్యాగేజ్‌ ఓన్లీ 'డీల్‌ ఫేర&'ని ఎతిహాద్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. ఎకానమీ క్లాస్‌లో అత్యంత చవకగా టిక్కెట్లు ఈ ఆఫర్‌లో అందుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిథులు పేర్కొన్నారు. డీల్‌ ఫేర్‌లో కాంప్లిమెంటరీ క్యారీ ఆన్‌ బ్యాగేజ్‌ని 7 కిలోల వరకు అందుబాటులో వుంటుంది. అబుదాబీ, బహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్‌, సౌదీ అరేబియా, జోర్డాన్‌, లెబనాన్‌, ఈజిప్ట్‌ మరియు అజర్‌బైజాన్‌ మధ్య ప్రయాణాలకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఎతిహాద్‌ ఎయిర్‌ వేస్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ, గత ఏడాది డీల్‌ ఫేర్‌ ఆఫర్‌ సక్సెస్‌ అవడంతో, ఈసారి మళ్ళీ దాన్ని ప్రవేశపెడ్తున్నామని చెప్పారు. అదనంగా బ్యాగేజ్‌ అవసరమైనవారు, దానికోసం ఎక్స్‌ట్రా అలవెన్స్‌ని చెక్‌ ఇన్‌ ఏరియాలో పొందవచ్చు. దీనిపైనా 20 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది.. అయితే ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com