జాకెట్‌లో బంగారం స్మగ్గ్లింగ్!
- September 03, 2018
చెన్నై: స్త్రీలు ధరించే జాకెట్లలో బంగారం దాచి, కనిపించకుండా ఎంబ్రాయిడరీ చేసి అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తితో పాటు, అతనికి స్వాగతం పలికేందుకు వచ్చిన వ్యక్తిని చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు సోమవారం అరెస్టు చేశారు.
చెన్నైకి చెందిన ఆయుబ్ ఖాన్ (32) కువైట్ నుంచి ఓమన్ ఎయిర్‌లైన్స్ విమానంలో సోమవారం చెన్నై విమానాశ్రయం చేరుకున్నాడు. అతను గ్రీన్ చానల్ మార్గంలో బయటకు వెళ్తున్నాడు. అతనికి స్వాగతం తెలిపేందుకు ముస్తఫా (27) అనే వ్యక్తి వేచి ఉన్నాడు. కస్టమ్స్ అధికారులు ఆయుబ్ ఖాన్‌ను మళ్లీ లోపలికి పిలువగా.. లోపలికి వెళ్లడానికి నిరాకరించడమే కాకుండా, తనిఖీలు ముగించుకునే కదా బయటకు వచ్చానని అధికారులతో వాగ్వాదం చేశాడు. దీంతో అతనిపై అనుమానంతో మళ్లీ తనిఖీ చేశారు.
అతని సూట్‌కేస్‌లో మహిళలు ధరించే మూడు జాకెట్లు ఉన్నాయి. వాటికున్న ఎంబ్రాయిడరీ డిజైన్‌లను అధికారులు తొలగించి చూడగా చిన్న చిన్న ముక్కలుగా బంగారం దొరికింది. అలాగే ఓ వంట పాత్ర వస్తువు పేరుతో ఉన్న ప్యాకెట్‌లో బంగారు కమ్మీలు దొరిగాయి. సుమారు 11 బంగారు ముక్కలుగా, రూ.15 లక్షల విలువైన 500 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయుబ్ ఖాన్, ముస్తఫాలను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







