త్వరలోనే విడుదల కానున్న 'ది విలన్' సినిమా

- September 03, 2018 , by Maagulf
త్వరలోనే విడుదల కానున్న 'ది విలన్' సినిమా

బెంగుళూరు:ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ది విలన్‌' సినిమా త్వరలోనే రానుంది. నెలాఖరులోగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సెన్సార్‌ ప్రక్రియ పూర్తయింది. సెంచురీ స్టార్‌ శివరాజ్‌కుమార్‌, సుదీప్‌ తొలిసారిగా కలిసి నటించడం విశేషం. ఇందులో కథానాయికగా ప్రముఖ నటి యామి జాక్సన్‌ నటించింది. విలన్‌ సినిమా గోడపత్రికలకు చెన్నపట్టణలో అభిమాని ఒకరు హారతులిచ్చారు. ఎప్పుడు విడుదలవుతుందా? అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు ప్రేమ్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించారు. చిత్రీకరణ, ఆడియో విడుదల... ఇలా అన్ని దశల్లో ఓ సంచలనాన్ని సృష్టిస్తూ చందనసీమలో ఓ క్రేజ్‌ను సృష్టించింది.ఇటీవలే దుబాయ్ లో స్టార్ నైట్ మరియు ది విలన్ ఆడియో ఫంక్షన్ నిర్వహించారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com