యూఏఈ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- September 03, 2018
రస్ అల్ ఖైమా:20 ఏళ్ళ వ్యక్తి ఒకరు, రస్ అల్ ఖైమాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఓ వాహనం ఆ వ్యక్తిని బలంగా ఢీకొన్నట్లు అధికారులు తెలిపారు. రస్ అల్ ఖైమా పోలీస్ ట్రాపిక్ అండ్ పెట్రోల్స్ సెక్షన్ హెడ్ మేజర్ సలీమ్ మొహమ్మద్ బుర్కిబా మాట్లాడుతూ, ప్రమాదం గురించిన సమాచారం అందగానే పెట్రోల్స్, నేషనల్ అంబులెన్స్ మరియు పారామెడిక్స్‌ని సంఘటనా స్థలానికి పంపించామని చెప్పారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారాయన. రోడ్డు దాటే క్రమంలో వేగంగా వస్తున్న వాహనాన్ని గుర్తించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విచారణలో తేలింది. వాహనం నడుపుతున్న డ్రైవర్ ఆ వాహనాన్ని సరిగ్గానే నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదాన్ని నివారించేందుకు వాహనదారుడు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. మృతదేహాన్ని హాస్పిటల్ మాగ్యూకి తరలించారు. వాహనదారులు, రోడ్లపై నడిచేవారు అప్రమత్తంగా వుంటే ఇలాంటి ప్రమాదాల్ని నివారించగలమని పోలీస్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







