దూసుకొస్తున్న మిస్సైల్‌ని ధ్వంసం చేసిన అరబ్‌ కోలిషన్‌

- September 03, 2018 , by Maagulf
దూసుకొస్తున్న మిస్సైల్‌ని ధ్వంసం చేసిన అరబ్‌ కోలిషన్‌

సౌదీ అరేబియా:అరబ్‌ కొలిషన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌, ఓ మిస్సైల్‌ని కూల్చివేశాయి. ఇరాన్‌ మద్దతుతో రెచ్చిపోతున్న హౌతీ తీవ్రవాదులు ఈ మిస్సైల్‌ని సౌదీ అరేబియా వైపు సంధించారు. యెమెన్‌లోని సాదా గవర్నరేట్‌ పరిధి నుంచి ఈ విమానం సౌదీ అరేబియా వైపు దూసుకురాగా, అత్యంత చాకచక్యంగా అరబ్‌ కొలిషన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ దాన్ని కూల్చివేసినట్లు కోలిషన్‌ స్పోక్స్‌ పర్సన్‌ వెల్లడించారు. కల్నల్‌ టుర్కి అల్‌ మాల్కి మాట్లాడుతూ, కొలిషన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌, దూసుకొస్తున్న బాలిస్టిక్‌ మిస్సైల్‌ని గుర్తించిందనీ, ఆ వెంటనే ఆ టెర్రరిస్ట్‌ మిస్సైల్‌ని కూల్చివేయడం జరిగిందన్నారు. సౌదీలోని జిజాన్‌లో జనం ఎక్కువగా వుండే ప్రాంతమే లక్ష్యంగా ఈ దాడికి యత్నించారు తీవ్రవాదులు. ఈ ఘటనతో ఇరాన్‌ మరింతగా హౌతీ తీవ్రవాదులకు అత్యాధునిక మిస్సైళ్ళను అందిస్తోందనే విషయం అర్థమవుతోందని కోలిషన్‌ ఫోర్సెస్‌ వెల్లడిస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com