జగపతి బాబు బాలీవుడ్ మూవీ ఫస్ట్ లుక్

- September 04, 2018 , by Maagulf
జగపతి బాబు బాలీవుడ్ మూవీ ఫస్ట్ లుక్

జగపతి బాబు పేరు చెప్పగానే అందరికీ ఓ సాఫ్ట్ హీరో ఇమేజ్ గుర్తుకొస్తుంది. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా అలరించిన జగపతి బాబు విలన్‌గా టర్న్ తీసుకొని ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీ అయ్యారు. తండ్రి పాత్రలో, విలన్ పాత్రలోను కనిపించి మెప్పిస్తున్నాడు. లెజెండ్ చిత్రంతో హీరో నుండి విలన్‌గా టర్న్ తీసుకున్న జగపతి బాబు తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి 13 సినిమాలు చేస్తున్నారు. అయితే ఆయన బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ నటించిన తానాజీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడని కొన్నాళ్ళ క్రితం వార్తలు వచ్చాయి. చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న తానాజీ చిత్రానికి ఓం రావత్‌ దర్శకుడు. ఛత్రపతి శివాజీ కోసం పోరాడిన సుబేదార్‌ తానాజీ పాత్రలో అజయ్‌ దేవగన్‌ నటించనుండగా, జగపతి బాబుని ముఖ్య పాత్రకి ఎంపిక చేశారు. రీసెంట్‌గా ఆయన పాత్రకు సంబంధించిన లుక్‌ టెస్ట్‌ను ఇటీవల నిర్వహించారు. ఈ లుక్ టెస్ట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోరమీసంతో వారియర్‌గా జగ్గూభాయ్ లుక్ అందరిని ఆకర్షించేలా ఉంది. ఈ చిత్ర రెగ్యులర్ షూట్ సెప్టెంబర్ 25 నుండి ప్రారంభం కానుంది.

చిత్రం 2019లో విడుదల కానుంది. 25 ఏళ్ళ సినీ కెరీర్‌లో 120 సినిమాలు చేసిన జగపతి బాబు నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నాడు. ఏడు రాష్ట్ర నంది అవార్డులు కూడా ఆయనని వరించాయి. సౌత్‌లో సెకండ్ ఇన్నింగ్స్ తో అదరగొడుతున్న జగపతి బాబు తానాజీ సినిమాతో ఉత్తరాదిన కూడా మంచి ఆఫర్స్ రాబడతాడని ఆయన అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com