టెన్నిస్ స్టార్ ఫెదరర్ కి చుక్కెదురు
- September 04, 2018
ఢిల్లీ : ఐదు సార్లు యూఎస్ ఓపెన్ విజేత, స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ కు చుక్కెదురైంది. యూఎస్ ఓపెన్ ప్రీ క్వార్టర్స్ పోటీల్లో భాగంగా జరిగిన పోటీల్లో ఓ అనామకుడి చేతిలో ఓటమి పాలయ్యాడు ఫెదరర్. యూఎస్ ఓపెన్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు జాన్ మిల్మాన్ సంచలనం సృష్టించాడు. పురుషులు ప్రీక్వార్టర్ ఫైనల్లో టెన్నిస్ దిగ్గజం, నంబర్ 2 సీడ్ ఆటగాడైన ఫెదరర్‌పై అనూహ్య విజయం సాధించాడు. ఆస్ట్రేలియాకు చెందిన అన్ సీడెడ్ ఆటగాడు జాన్ మిల్ మాన్, ఫెదరర్ ను నాలుగు సెట్లు సాగిన మ్యాచ్ లో ఓడించి సరికొత్త స్టార్ గా నిలిచాడు. తొలి సెట్ ను 3-6 తేడాతో కైవసం చేసుకున్న ఫెదరర్, ఆపై మిల్ మాన్ థాటికి తలొగ్గాడు. వరుసగా మూడు సెట్లను 7-5-, 7-6, 7-6 తేడాతో మిల్ మాన్ గెలిచాడు. క్వార్టర్ ఫైనల్స్ లో మిల్ మాన్, నోవాక్ జకోవిచ్ తో తలపడనున్నాడు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







