జపాన్ ను కుదిపేసిన తుఫాన్
- September 04, 2018
జపాన్ లో భారీ తుఫాన్ సంభవించింది. గత 25ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా టైఫూన్ జెబీ అతలాకుతలం చేసింది. జెబీ దాటికి తీవ్ర నష్టం జరిగింది. ఈ తుఫాను దాటికి ఆరుగురు మృతి చందాగా, వందల సంఖ్యలో ప్రజలకు గాయాలయ్యాయి. గంటకు 210కి.మీ. వేగంతో గాలులు వీచాయి. దీంతో ఏమి జరుగుతుందో అర్థంకాలేదు. ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. రోడ్లపై వాహనాలు గాలికి కొట్టుకుపోయాయి.
క్యూటోలో రైల్వే స్టేషన్ పైకప్పు కూడా గాలికి కొట్టుకుపోయింది. మిలియన్ కు పైగా జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అధికారులు తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వేల సంఖ్యలో గ్రామాలు, పట్టణాలు చీకట్లో ఉన్నాయి. జపాన్ లో ఇళ్లు ఎక్కువ భాగం కలపతో నిర్మించుకుంటారు. దీంతో ప్రచంచగాలులకు ఆ ఇళ్లు కిలోమీటర్ల మేర కొట్టుకు పోయాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







