కార్తికేయ చేతుల మీదుగా ‘రథం’ టీజర్
- September 05, 2018
ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్తతరహా సినిమాల ట్రెండ్ మొదలయింది. ఇటీవల డిఫరెంట్ స్టోరీస్తో తెరకెక్కిన సినిమాలు మాక్జిమం సూపర్ హిట్ అయ్యాయి. అందులో ముఖ్యంగా ‘RX100’ , ‘గీత గోవిందం’ సినిమాలు కొత్త తరహా కథలను ప్రేక్షకులకు పరిచయం చేశాయి. అదే తరహాలో మరో సినిమా రూపొందుతోంది. గీతానంద్, చాందిని హీరో హీరోయిన్లుగా ‘రథం’ తెరకెక్కుతోంది. ఈ సినిమాను రాజుగారు ఫిలిమ్స్ పతాకంపై.. రాజా ధారపునేని నిర్మిస్తుండగా.. కే వినోద్ సమర్పిస్తున్నారు. ఇవాళ RX100 హీరో కార్తీకేయ చేతుల మీదుగా ‘రథం’ టీజర్ ను ఆవిష్కరించనున్నారు. ఈ సినిమాకు కెమెరామెన్.. సునీల్ ముత్యాల, మ్యూజిక్.. సుకుమార్ పమ్మి. నరేన్, రాజ్ ముదిరాజ్, ప్రమోదిని, మిర్చి మాధవి, రామ్ తదితరులు నటిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







