రూల్స్ సడలించిన ఖతార్
- September 05, 2018
ఖతార్: విదేశీ వర్కర్లకు ఖతార్ గుడ్‌న్యూస్ చెప్పింది. వివాదాస్పద ఎగ్జిట్ వీసా విధానాన్ని సవరిస్తున్నట్టు ఖతార్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ దేశంలో పనిచేస్తున్న లక్షల మంది వలస కార్మికులకు భారీ ఊరట కలిగింది. ఈ వీసా విధానం సవరణతో, యజమానులు(ఎంప్లాయర్స్) అనుమతి లేకుండానే.. కార్మికులు ఆ దేశం విడిచి రావొచ్చు. సుదీర్ఘకాలంగా కార్మిక హక్కుల సంఘాలు చేస్తున్న ఈ డిమాండ్‌ను ఖతార్ ప్రభుత్వం ఆమోదించింది. ఖతార్‌లో పనిచేస్తున్న చాలా మంది వలస కార్మికులను ఆ దేశం విడిచి వెళ్లకుండా ఎంప్లాయర్స్ వేధిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికుల కాంట్రాక్ట్ సమయం అయిపోయినప్పటికీ, యజమానులు తమల్ని విడిచిపెట్టడం లేదని కార్మికులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విదేశీ కార్మికులకు భారీ ఊరటనిస్తోంది. ప్రస్తుతం ఖతార్‌లో 16 లక్షల మందికి పైగా విదేశీ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఆసియా నుంచి వెళ్లినవారే. వారిలో ఎక్కువగా కూడా భారత్ నుంచి ఖతార్ వెళ్లినవారే ఉన్నారు.
ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకటించింది. దీని వల్ల వలస కార్మికుల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ఆ సంస్థ తెలిపింది. ఖతార్ ప్రభుత్వంతో అంతర్జాతీయ కార్మిక సంస్థ చేసుకున్న ఒప్పందం ప్రకారం కార్మికులకు కనీస వేతనం, బకాయి వేతనాల చెల్లింపు, ఫండ్లు అందనున్నాయి. ఖతార్లోని వలస కార్మికులకు మంచి పనిని, రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ కార్మిక శాఖ మంత్రి ఇస్సా సాద్ అల్ జఫర్ అల్-నూమిమి తెలిపారు. 2022లో ఖతార్ ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ను నిర్వహించబోతుంది. ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్ వరల్డ్ కప్ పనుల్లో భారీ ఎత్తున్న విదేశీ కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఖతార్‌లో పనిచేస్తున్నారు. అయితే ఎగ్జిట్ వీసా విధానంలో సవరణలు తీసుకొచ్చినప్పటికీ, విదేశీ కార్మికులు, ఉద్యోగాన్ని మారాలనుకుంటే, ప్రస్తుత యజమానుల వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







