జపాన్‌లో తీవ్ర భూకంపం

- September 05, 2018 , by Maagulf
జపాన్‌లో తీవ్ర భూకంపం

జపాన్‌లోని ఉత్తర ద్వీపం హొక్కాయ్‌డోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 20 మంది తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. భూకంపం కారణంగా పలు చోట్ల భవనాలు కూలిపోయి, 20 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. హొక్కాయ్‌డోలోని ప్రధాన నగరం సప్పోరోకి 68 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. ప్రభుత్వం రైలు సేవలను నిలిపివేసినట్టు తెలుస్తోంది. హొక్కాయ్‌డో, చిటోసాలలోని ఎయిర్ పోర్టులను తాత్కాలికంగా మూసివేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com