వీకెండ్ వెదర్: అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం!
- September 06, 2018
యూఏఈ: వీకెండ్ వెదర్ విషయంలో నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ యూఏఈ వాసులకు తీపి కబురు అందించింది. ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గనున్నట్లు వీకెండ్ ప్రియులకు ఆ తీపి కబురు తెలిపింది. అయితే సాధారణం నుంచి ఓ మోస్తరు గాలుల కారణంగా డస్ట్ ఎక్కువగా 'బ్లో' అవుతుంది. ఈ కారణంగా విజిబిలిటీ తగ్గుతుంది గనుక వాహనదారులు అప్రమత్తంగా వుండాలి. అత్యల్ప ఉష్ణోగ్రత యూఏలోని జైస్ మౌంటెయిన్స్ వద్ద 24.8 డిగ్రీస్ సెల్సియస్‌గా నమోదయ్యింది. అరేబియన్ గల్ఫ్ మరియు ఒమన్ సీ సాధారణం నుంచి ఓ మోస్తరు రఫ్‌గా వుండొచ్చు. ఈ వారంతమంతా ఇదే పరిస్థితులు కొనసాగుతాయని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. పగటి పూట కాస్త వేడిగానే వుంటుంది. హ్యుమిడిటీ కూడా ఎక్కువగానే వుండొచ్చు. అక్కడక్కడా మేఘాలు ఏర్పడే అవకాశం వుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







