కేరళ స్కూళ్ళకు 100,000 పెన్సిల్స్‌: పెన్సిల్‌ మేన్‌

- September 06, 2018 , by Maagulf
కేరళ స్కూళ్ళకు 100,000 పెన్సిల్స్‌: పెన్సిల్‌ మేన్‌

దుబాయ్‌:పెన్సిల్‌ మేన్‌గా పేరొందిన దుబాయ్‌కి చెందిన ఫిలాంత్రపిస్ట్‌ కె.వెంకట్రామన్‌, కేరళలోని 50 స్కూళ్ళకు ఉచితంగా స్టేషనరీ, యూనిఫామ్స్‌ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే 100,000 పెన్సిళ్ళను అందిస్తున్నట్లు ప్రకటించారాయన. జాయ్‌ఫుల్‌ గిఫ్టింగ్‌ అనే సోషల్‌ ఎంటర్‌ప్రైజ్‌న ముంబైలో స్థాపించిన వెంకట్‌, మారుమూల గ్రామాల్లోనివారికి ఇలాంటి సహాయం ఎంతో ఉపయోగపడ్తుందని చెప్పారు. తనతోపాటు కలిసివచ్చేవారు తగు రీతిలో డొనేషన్స్‌ ఇండియన్‌ బ్యాంక్స్‌ ద్వారా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారాయన. భారతదేశంలో ప్రముఖ పెన్సిల్స్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ సంస్థ అయిన నటరాజ్‌ పెన్సిల్స్‌తో అసోసియేట్‌ అయి వున్న వెంకట్‌, 100 పెన్సిళ్ళ ప్యాక్‌ని ఈ డొనేషన్‌ పర్సస్‌ కోసం తయారుచేయాల్సిందిగా ఒప్పించినట్లు చెప్పారు. ఎమిరేట్స్‌ రెడ్‌ క్రిసెంట్‌తోనూ అసోసియేట్‌ అయి వున్న వెంకట్‌, కార్పొరేట్స్‌ - స్కూల్స్‌ - ఛారిటీ ఆర్గనైజేషన్స్‌కి సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. 7.5 టన్నుల రిలీఫ్‌ ఐటమ్స్‌ని కేరళ వరద బాధితుల కోసం సేకరించే క్రమంలో ఆయన తనవంతు సహకారం అందించారు.
  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com