ఇండియా-అమెరికా మధ్య మరో సైనిక సహకార ఒప్పందం

- September 06, 2018 , by Maagulf
ఇండియా-అమెరికా మధ్య మరో సైనిక సహకార ఒప్పందం

న్యూఢిల్లీ: ఈ ఏడాదిలో ఇండియా-అమెరికా మధ్య జరిగిన అత్యున్నత స్థాయి ద్వైపాక్షిక (2+2) చర్చల ప్రక్రియలో ఇరుదేశాలు విస్తృత స్థాయి సైనిక సహకారంపై రెండో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంపై అమెరికా రక్షణ మంత్రి జిమ్‌ మాటిస్‌, భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ సంతకాలు చేశారు. కాంకాసా అనే పేరుతో పిలువబడే ఈ కమ్యూనికేషన్స్‌ కంపాటబులిటీ, సెక్యూరిటీ అగ్రిమెంట్‌ ద్వారా సైబర్‌ కమ్యూనికేషన్స్‌, నిఘా సమాచారం, కమ్యూనికేషన్‌ పరికరాల మార్పిడి, భద్రతతో కూడిన కమ్యూనికేషన్‌ ఛానల్స్‌ ఏర్పాటు వంటి వాటికి వీలు ఏర్పడుతుంది. ఈ కామ్‌కాసా ఒప్పందం ద్వారా భారత్‌ రక్షణ సన్నద్ధతను మెరుగుపరిచేందుకు అమెరికా సహకరిస్తుందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరించారు. వచ్చే ఏడాది భారత తూర్పు తీరంలో ఇరుదేశాలు త్రివిధ దళాలతో తొలిసారిగా సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహిస్తాయని ఆమె ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com