ఆసక్తి రేకెత్తిస్తున్న 'జనతా హోటల్' సినిమా టీజర్
- September 07, 2018
మహానటి ఫేం దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ఉస్తాద్ హోటల్. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని సురేష్ కొండేటి తెలుగులో జనతా హోటల్ పేరుతో సెప్టెంబర్ 14న విడుదల చేయబోతున్నాడు. సురేష్ కొండేటి నిర్మించిన ప్రేమిస్తే, షాపింగ్ మాల్, జర్నీ వంటి సినిమాలకి మంచి ఆదరణ లభించడంతో ఈ సినిమాపై కూడా భారీ ఆసక్తి నెలకొంది. గ్లామర్ భామ నిత్యామీనన్ కథానాయికగా నటించింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీకి సంబంధించిన టీజర్స్ ని రోజుకొకటి చొప్పున విడుదల చేయాలని భావించారు. ఇందులో భాగంగా తొలి టీజర్ విడుదల చేశారు.ఇందులో తండ్రికి వరుసగా నలుగురు ఆడపిల్లలు పుట్టడం, అయిన ఆశతో అబ్బాయి కోసం ఎదురు చూడడం, చివరికి ఐదో సంతానంగా అబ్బాయి పుట్టడం.. పుట్టిన పిల్లాడు తండ్రికి నచ్చకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం.. చివరకి పెళ్లి చూపులో క్వాలిఫికేషన్ ఏంటని అమ్మాయి అడిగితే , విదేశాలలో చెఫ్ కోర్సు మాత్రమే చేసానని చెప్పడం.. ఇలా పలు ఆసక్తికర సన్నివేశాలతో టీజర్‌ని రూపొందించి విడుదల చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







