జార్జియా వెళ్తున్న 'సైరా' టీం

- September 07, 2018 , by Maagulf
జార్జియా వెళ్తున్న 'సైరా' టీం

చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. నయనతార కథానాయిక. అమితాబ్‌బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్‌ నిర్మాత. ఇటీవల హైదరాబాద్‌లో కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఇప్పుడు 'సైరా' టీమ్‌ జార్జియా వెళ్లబోతోంది. అక్కడ దాదాపు ఇరవై రోజుల పాటు ఓ కీలక షెడ్యూల్‌ చిత్రీకరిస్తారు. ప్రధాన తారాగణం మొత్తం పాల్గొంటుంది. తిరిగొచ్చాక మళ్లీ హైదరాబాద్‌లో మరో దఫా చిత్రీకరణ మొదలెడతారు. ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. 2019 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. సుదీప్‌, తమన్నా, నిహారిక, జగపతిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అమిత్‌ త్రివేది, ఛాయాగ్రహణం: రత్నవేలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com