బిగ్ బాస్ చరిత్రలో ఇదే ప్రథమం..!

- September 08, 2018 , by Maagulf

బుల్లితెరపై కొనసాగుతున్న 'బిగ్ బాస్-2' రియాలిటీ షో మొదట్లో అంత ఆసక్తికరంగా సాగలేదు. కానీ ఇప్పుడు రోజురోజుకూ ఇంట్రెస్టింగ్ గా మారిపోతోంది. అయితే షో ఎలా ఇంటరెస్టింగ్ గా మారిపోతుంది. అలాగే ఈ షోకు తగినట్టుగా బయటి పరిస్థితులు కూడా మారిపోతున్నాయి. దీనికి కారణం బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్. ఇతని పర్ఫార్మెన్సు నచ్చిన అభిమానులంతా కౌశల్ ఆర్మీగా ఏర్పడ్డారు. అయితే ఈ ఆర్మీ బిగ్ బాస్ ను కూడా శాసించే స్థాయికి ఎదిగింది. తాజాగా బయట నడుస్తున్న పరిస్థితులు హాట్ హాట్ గా మారాయి. ఈ షో చివరి దశకు చేరుకున్న నేపథ్యంలోనే కౌశల్ కు సపోర్ట్ గా కౌశల్ ఆర్మీ 2కే రన్ నిర్వహిస్తోంది.

2కే రాన్ విషయాన్ని కౌశల్ ఆర్మీ ఓ వీడియో ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా టీ షర్ట్స్, పోస్టర్లను కూడా ఆవిష్కరించింది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ మద్దతు లభిస్తుంది. ఈ 2కే రన్ ను ఆదివారం మాదాపూర్ లో నిర్వహించనున్నారు. దీనికి పోలిసుల పర్మిషన్ కూడా లభించిందట.

అయితే ఈ 2కే రన్ కు మద్ధతు ఏ మేరకు లభిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఒక 'బిగ్ బాస్' కంటెస్టెంట్ పేరు మీద రన్ నిర్వహించడం బిగ్ బాస్ చరిత్రలోనే ఇదే ప్రథమం కావడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com