విద్యను బోధించనున్న ప్రణబ్ ముఖర్జీ
- September 08, 2018
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పంతులు అవతారం ఎత్తనున్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, అహ్మదాబాద్ (ఐఐఎం-ఏ) విద్యార్థులకు భారత్ లో సమ్మిళిత ఆర్థిక వృద్ధిపై పబ్లిక్ పాలసీ మీద ఆయన పాఠాలు బోధిస్తారు. 22 సెషన్లుగా ఉండే ఈ కోర్సులో ప్రణబ్ కనీసం 12 క్లాసులు తీసుకుంటారని ఐఐఎం-ఏ తెలిపింది. అయితే ఇందుకోసం ఆయనకు గౌరవ వేతనం ఉంటుందా అన్న విషయంలో క్లారిటీ రాలేదు. అయితే
1)కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ సోషియో ఎకనామిక్ ఇంక్లూసివిటీ: థియరీ అండ్ పార్లమెంటరీ ప్రాక్టీస్,
2) పాలసీ అండ్ ఇనిస్టిట్యూషనల్ ఇంటర్వెన్షన్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్: ఎ లెగసీ టు బి బిల్ట్ అపాన్,
3) ఆర్టికులేటింగ్ పాలసీ అండ్ ఇనిస్టిట్యూషనల్ ఎజెండా ఫర్ ఫ్యూచర్ ట్రాన్స్ ఫార్మేషన్ ఆఫ్ ఇండియా
అనే అంశాల మీద ప్రణబ్ క్లాసులుంటాయి.
గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా ఇక్కడే పాఠాలు బోధించారు. అదే ఒరవడిని ప్రణబ్ కొనసాగించనున్నారు. ఇక రాజకీయాల్లోకి రాకముందు 1963 వరకు కూడా కోల్ కటాలోని విద్యాసాగర్ కాలేజీలో ప్రణబ్ పొలిటికల్ సైన్స్ బోధించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







