రజనీకాంత్‌కి భారీ సెక్యూరిటీ
- September 09, 2018
ఇటీవలి కాలంలో ఆగంతకులు షూటింగ్ స్పాట్‌కి వెళ్ళి రచ్చ చేయడం లేదంటే, లొకేషన్ ప్రాపర్టీస్‌ని ధ్వంసం చేయడం జరగుతూ వస్తుంది. ఈ క్రమంలో చిత్ర బృందంతో పాటు స్టార్ హీరోలకి ప్రభుత్వం భారీ సెక్యూరిటీ కలిపిస్తుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అతి త్వరలో పూర్తి రాజకీయాలలోకి రానుండగా, ఆయనకి భద్రత మరింత పెంచారు. తన 165వ చిత్రం పేటా ప్రస్తుతం లక్నోలో షూటింగ్ జరుపుకుంటుంది. వారణాసిలోను కొన్ని రోజుల పాటు షూటింగ్‌కి ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తలైవాకి 25 మంది పోలీసులతో కూడిన భారీ సెక్యూరిటీని కల్పించింది, అంతేకాదు ఆయన ఉండే ప్రాంతంలో ఎప్పుడూ ఓ మిలిటరీ పోలీసు వ్యాన్ పహారా కాస్తుందట. మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న పేటా చిత్రాన్ని జిగర్తాండ ఫేం కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో రజనీకాంత్ సరసన త్రిష కథానాయికగా నటిస్తుంది. కళానిధిమారన్ సమర్పణలో మమ్మోత్ ప్రొడక్షన్ కంపెనీ ఈ మూవీని నిర్మిస్తుంది. విజయ్ సేతుపతి, సిమ్రన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







