అభిమాని ఆఖరి కోరిక తీర్చిన సూపర్ స్టార్
- September 08, 2018
అభిమానులు లేనిదే హీరోలు లేరులే.. అన్న పాట రజనీకాంత్ నటించిన కుచేలన్ చిత్రంలో ఉంది. దీన్ని ఎంత మంది హీరోలు గ్రహిస్తారో గానీ, నటుడు రజనీకాంత్‌కు ఈ విషయం బాగా తెలుసు. అందుకే ఆయన తరచూ తన అభిమానులను కలిసి వారికి సంతోషాన్ని కలిగిస్తుంటారు. నాగర్‌కోవిల్ సమీపంలోని కోట్టార్ వాగైయడి గ్రామానికి చెందిన అవినాష్ అనే 12 ఏళ్ల బాలుడు రజనీకాంత్‌కు వీరాభిమాని.7వ తరగతి చదువుతున్న ఆ బాలుడు రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతని తల్లితండ్రులు స్వామినాథన్, లత కుమారుడి అవయవాలను దానం చేశారు.
అవినాష్ తన అభిమాన నటుడు రజనీకాంత్ చిత్ర పటాన్ని పెన్సిల్‌తో చెక్కాడు. ఆ ఫొటోను రజనీకాంత్‌కు చూపించి దానిపై ఆయన సంతకం చేయించుకోవాలని ఆశ పడ్డాడు. ఆ కోరిక నెరవేకుండానే దుర్మరణం పాలయ్యాడు. తమ కుమారుడి ఆశను ఎలాగైనా నెరవేర్చాలని అతని తల్లిదండ్రులు భావించారు. ఈ విషయాన్ని ఒక లేఖ ద్వారా రజనీకాంత్‌కు తెలియజేశారు.
ఆ లేఖ చదివిన రజనీకాంత్ ఇటీవల అవినాష్ తల్లిదండ్రులను ఇంటికి పిలిపించుకుని ఓదార్చారు. ఈ సందర్భంగా వారు తమతో తీసుకొచ్చిన చిత్రపటాన్ని చూపించగా అందులో రజనీకాంత్ సంతకం చేశారు. అవయవదానం చేసిన మీ కుమారుడు ఎప్పటికీ సజీవంగానే ఉంటాడని చెప్పి పంపారు. ఈ విషయం తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడి కోరికను నెరవేర్చామన్నారు. ఇప్పుడు ఆత్మశాంతిస్తుందని భావిస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







