'సావిత్రి' కాలేకపోయా..కారణం చెప్పలేను అంటున్న నిత్యా

- September 09, 2018 , by Maagulf
'సావిత్రి' కాలేకపోయా..కారణం చెప్పలేను అంటున్న నిత్యా

ఈ యేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన 'మహానటి' సావిత్రి బయోపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహానటి స్పూర్తిగా తీసుకొని తెలుగు తెరపై మరిన్ని బయోపిక్ లు రూపొందుతున్నాయి. ఇక, మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అదరగొట్టింది. ఐతే, సావిత్రి పాత్ర కోసం కీర్తి కంటే ముందే మరో హీరోయిన్ ని సంప్రదించింది చిత్రబృందం. అమె నిత్యామీనన్.

'అలా మొదలైంది' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ప్రత్యేకమైన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొంది. తొలి సినిమాతోనే సావిత్రిలా ఉందంటూ ప్రశంసలు అందుకొంది. ఇక, మహానటి సావిత్రి కోసం ముందుగా నిత్యామీనన్ నే అడిగారు. ఆమె నటిస్తానని చెప్పింది. అద్భుతమైన సావిత్రిగారి పాత్ర అంటే మాటలా. చేస్తానని చెప్పా. ఆ తర్వాత ఆ సినిమాను వదులుకున్నా. దానికి కారణం అడిగితే చెప్పలేను అంటోంది నిత్యా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com