టూరిస్టుల రాకకు మరల ముస్తాబవుతున్న కేరళ

- September 09, 2018 , by Maagulf
టూరిస్టుల రాకకు మరల ముస్తాబవుతున్న కేరళ

కేరళలో టూరిజాన్ని మళ్లీ పుంజుకునేలా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత నెలలో ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా నష్టపోయిన కేరళ తిరిగి నెమ్మదిగా కోలుకుంటోంది. రాష్ట్రంలో ప్రముఖ టూరిస్టు ప్రాంతాలు, హోటళ్లు, రిసార్టులు ఎటువంటి విధ్వంసానికి గురికాలేదని. టూరిజం శాఖ డైరెక్టర్ బాల కిరణ తెలిపారు. అక్టోబర్ మాసం నుంచి టూరిస్టులు కేరళకు రావచ్చని మరో ప్రముఖ అధికారి అభయమిచ్చారు.

త్వరలో నిర్వహించనున్న ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ ను విజయవంతం చేసేందుకు టూరిజం శాఖ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. విమాన సర్వీసులు, రోడ్డు, రైలు మార్గాలు అన్నిషెడ్యూల్ ప్రకారం పనిచేస్తున్నాయని బాల కిరణ తెలిపారు. ఉత్తర కేరళలో ఉన్న కన్నూర్ విమానాశ్రయం కూడా త్వరలోనే సర్వీసులు ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు.

కేరళ ట్రావెల్ మార్ట్ 2018 సెప్టెంబర్ 27 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరగనుంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తరలి రావాలని కోరుతూ టూరిజం శాఖ అధికారులు గుజరాత్‌లో పలు ప్రాంతాల్లో పర్యటనలు చేపట్టారు. కేరళ అందాలను తిలకించాలని గుజరాత్ ప్రజలను కోరారు.

కేరళ రాష్ట్రానికి వచ్చే మొత్తం పర్యాటకుల్లో గుజరాత్‌, మహారాష్ట్రల నుంచే దాదాపుగా 25 శాతం మంది ఉంటారు. దీంతో కేరళ టూరిజం అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటనలు చేపట్టి. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com