2019 లో వస్తున్న ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్

- September 09, 2018 , by Maagulf
2019 లో వస్తున్న ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్

స్మార్ట్ ఫోన్ యూజర్స్ లో ఆసక్తి రేపుతున్న పోల్డబుల్ ఫోన్.. ఇక వచ్చే సంవత్సరమే పలకరించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని శ్యాంసంగ్ మొబైల్ ప్రెసిడెంట్ డీజే కో స్వయంగా ప్రకటించారు. వాస్తవానికి 2018లోనే పోల్డబుల్ ఫోన్ తీసుకురావాలనుకున్నామని, అయితే మరిన్ని టెస్ట్ లు జరపాల్సి ఉన్నందున 2019కి పోస్ట్ పోన్ చేస్తున్నామని ఆయన చెప్పారు.

ఈ వెరైటీలో ఫోన్ ని పూర్తిగా తెరవకుండానే ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అయితే బ్రౌజింగ్ చేయాలన్నా, ఏదైనా చూడాలన్నా పూర్తిగా తెరవాల్సి వచ్చినప్పుడు ఫోల్డబుల్ వెరైటీతో ఉపయోగం ఏముంటుందని కస్టమర్ ఆలోచిస్తాడని, అందువల్ల దాని యూసేజ్ ని మరింత ఉపయోగకరంగా ఉండేలా చేయడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు. మొత్తానికి త్వరలోనే శ్యాంసంగ్ నుంచి ఫోల్డబుల్ వెర్షన్ మొబైల్ వస్తోందన్నమాట. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com