రుస్తాక్‌ హత్య వెనుక చిన్న గొడవే కారణం

- September 09, 2018 , by Maagulf
రుస్తాక్‌ హత్య వెనుక చిన్న గొడవే కారణం

మస్కట్‌: రుస్తాక్‌లో ఇటీవల జరిగిన హత్యకు ఇద్దరు పౌరుల మధ్య జరిగిన ఘర్షణే కారణమని తేల్చారు. ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం ఈ హత్యకు దారి తీసిందని పోలీసులు వివరించారు. నిందితుడు, తన స్నేహితుడ్ని బలమైన వస్తువుతో కొట్టడంతో తీవ్ర గాయాలతో బాధిత వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం బాధిత వ్యక్తిని జుమైరా ప్రాంతంలోని ఓ రోడ్డు పక్కనే పడేసి వెళ్ళిపోయాడు. విలాయత్‌ ఆఫ్‌ రుస్తాక్‌లో బాధితుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. కేవలం 48 గంటల్లోనే నిందితుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేయగలిగారు. సౌత్‌ అల్‌ బతినా గవర్నరేట్‌ పోలీస్‌ - ఇంక్వైరీస్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ నిందితుడ్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. లీగల్‌ ప్రొసిడ్యూర్స్‌ జరుగుతున్నట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com