హాస్య నటుడు కోవై సెంథిల్ కన్నుమూత
- September 09, 2018
తమిళనాడు, పెరంబూరు: హాస్య నటుడు కోవై సెంథిల్(74) ఆదివారం ఉదయం కోవైలో కన్నుమూశారు. పలు చిత్రాల్లో హాస్య పాత్రలతో పాటు, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించి మెప్పించిన నటుడు కోవై సెంథిల్. ముఖ్యంగా ఈయన దర్శకుడు విక్రమన్ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. రజనీకాంత్ నటించిన పడయప్పా, కే.భాగ్యరాజ్ నటించి, దర్శకత్వం వహించిన ఇదునమ్మ ఆళు, వెంకట్‌ప్రభు తెరకెక్కించిన గోవా చిత్రాల్లో మంచి గుర్తింపు పొందాడు. కోవైలో నివశిస్తున్న కోవై సెంథిల్ ఇటీవల అనారోగ్యానికి గురై కోవైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆదివారం సాయంత్రమే ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిపారు. కోవై సెంథిల్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత నటీనటుల సంఘం కోవై సెంథిల్‌కు సంతాపం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. గత 4వ తేదీన హాస్య నటుడు రాకెట్ రామనాథన్, 5వ తేదీన నటుడు వెళ్లై సుబ్బయ్య, ఇప్పుడు నటుడు కోవై సెంథిల్ ఇలా ఒకే వారంలో ముగ్గురు సీనియర్ నటులు మృతి చెందారన్నది గమనార్హం.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







