చెర్రీ @ అజర్బైజాన్
- September 11, 2018

రామ్‌చరణ్ - బోయపాటి కాంబోలో ఓ ఫిల్మ్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇంకా పేరు పెట్టని ఈ ఫిల్మ్ కోసం యూనిట్ అజర్‌బైజాన్‌కి వెళ్లింది. రష్యా బోర్డర్‌కి మూడు కిలోమీటర్ల దూరంలోవున్న ప్రాంతంలో షూట్ చేస్తోంది. ఆ ప్రాంతంలో తోడేళ్లు, ఎలుగుబంట్లు, చిరుతలు ఎక్కువగా వున్నట్లు సమాచారం.
ఇదిలావుండగా ఎత్తయిన పర్వతాలకు చల్లటి గాలులు ఎక్కువగా వుండడంతో వేగంగా చిత్రీకరణ చేస్తున్నారు. బీహార్ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. చెర్రీ, వివేక్ ఓబెరాయ్, కైరాఅద్వానీ, బోయపాటిలతో కొంతమంది ఫైటర్లు పాల్గొంటున్నారు.
ఈ షూట్ తొలుత బీహార్‌కే వెళ్లాలని ప్లాన్ చేసినా, అక్కడ ఎక్కువ ఖర్చు అవుతుందని భావించి, చివరకు అజర్బైజాన్ వైపు మళ్లింది యూనిట్.
మరోవైపు యాక్షన్ సన్నివేశాలను ఓ రేంజ్లో బోయపాటి తెరకెక్కిస్తున్నాడని, ఈ విషయంలో చిరు సలహాని ఆయన పక్కనపెట్టినట్టు ఫిల్మ్‌నగర్ సమాచారం.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







