ప్యాకప్ చెప్పేసిన 'దేవదాస్'

- September 11, 2018 , by Maagulf
ప్యాకప్ చెప్పేసిన 'దేవదాస్'

అక్కినేని నాగార్జునతో కలిసి పనిచేయడం ఎంతో అద్భుతంగా ఉందని అంటున్నారు ప్రముఖ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య. ఆయన దర్శకత్వంలో వస్తున్న 'దేవదాస్‌' చిత్రీకరణ నేటితో పూర్తైంది. ఈ విషయాన్ని నాగ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ''దేవదాస్‌' సినిమా చిత్రీకరణ పూర్తైంది. చిత్ర బృందానికి ధన్యవాదాలు. చాలా అమేజింగ్‌గా అనిపించింది' అని ట్వీట్‌ చేస్తూ చిత్ర బృందంతో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్‌ చేశారు. ఈ శనివారం సినిమా ఆడియో విడుదల ఉంటుందని సమాచారం. ఈ నెల 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com