ఉత్తర భారతంలో వరుస భూకంపాలు.. భయాందోళనలో ప్రజలు
- September 11, 2018
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.6గా నమోదైంది. బుధవారం ఉదయం 5:15 గంటలకు భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది.
కొద్దిసేపటికే ఉదయం 5:43 గంటలకు హర్యానా రాష్ట్రంలో కూడా స్వల్పంగా భూమి కంపించింది. కొన్ని సెకన్ల పాటు హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో భూమి కంపించడంతో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.1గా నమోదైంది. భూ ప్రకంపనలు సంభవించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురై ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు.
రిక్టర్ స్కేలుపై అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నివేదికలు కొద్దిసేపటి క్రితం వెలువడ్డాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు.. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. అంతకు ముందు సెప్టెంబరు 9న ఝజ్జర్ జిల్లాలో రిక్టర్ స్కేలుపై 3.8తీవ్రతతో భూకంపం సంభవించింది.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







