డెసర్ట్ డ్రైవింగ్: కొత్త లైసెన్స్‌లు ప్రారంభం
- September 12, 2018
షార్జా:షార్జా డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్, డిజర్ట్ వెహికిల్స్‌కి డ్రైవర్ లైసెన్సుల్ని ప్రకటించింది. డెసర్ట్ సఫారీ టూరిజం కంపెనీలకు సైతం లైసెన్సుల్ని మంజూరు చేయనున్నారు. సెప్టెంబర్ 16 నుంచి ఈ లైసెన్సులు అందుబాటులోకి వస్తాయి. రానున్న రోజుల్లో చల్లటి వాతావరణం నేపథ్యంలో పలు సంస్థలు సఫారీ ట్రిప్స్‌ని టూరిస్టుల కోసం ఏర్పాటు చేస్తుంటాయనీ, వాటి కోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్ హెడ్, డైరెక్టర్ ఆఫ్ లైసెన్సింగ్ వెహికిల్స్ కల్నల్ అలి అల్ బజౌద్ చెప్పారు. టూరిస్టులకు ఎలాంటి ప్రమాదాలూ తలెత్తకుండా నిపుణులైన డ్రైవర్లను ఆయా సంస్థలు ఏర్పాటు చేసుకునేలా లైసెన్సుల ప్రక్రియ ఏర్పాటు చేశామన్నారు. అలాగే సంస్థలకూ లైసెన్సులు ఇవ్వడం ద్వారా టూరిస్టుల భద్రతకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు. డ్రైవర్లకు స్పెషల్ ప్రిపరేషన్ వుంటుంది టెస్ట్ పాస్ అవడానికి. థియరీ, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







